వైసిపీ ఎంపీ విజయ సాయి రెడ్డి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటారు. అటు చంద్రబాబు, లోకేష్ లు విజయ్ సాయిరెడ్డిపై అదే స్థాయిలో విరుచుకుపడతారు. అది రాజకీయాల్లో మాములే. కానీ ఇప్పుడు రాజకీయాలని పక్కనబెట్టి విజయ్ సాయిరెడ్డి చంద్రబాబు కలిసినట్టుగా కనిపించడం చూసిన వారికి అస్సలు మింగుడు పడడం లేదు. చంద్రబాబు బావమరిది కొడుకు, నందమూరి బాలకృష్ణ అన్న కొడుకు, నందమూరి హీరో తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తారకరత్న భార్య అలేఖ్యకు చిన్నాన్న అయిన విజయ్ సాయి రెడ్డి తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడే బెంగుళూరు వెళ్లివచ్చారు. ఇక తారకరత్న పోయినప్పటినుండి ఆయన తారకరత్న నివాసం దగ్గరే ఆయన భౌతిక కాయం దగ్గరే ఉన్నారు.
మరి అటు బంధువు, ఇటు శత్రువు. అయినప్పటికీ చంద్రబాబుతో మాట కలిపారు, బాలయ్యతో మట్లాడారు. చంద్రబాబు-బాలయ్యలు విజయసాయిరెడ్డి పక్క పక్కనే కూర్చున్నారు. తారకరత్న అంత్యక్రియలు జరిగే వరకు విజయసాయి రెడ్డి నందమూరి, నారా ఫ్యామిలీతో ఉన్నారు. తారకరత్న వివాహం సమయంలో అలేఖ్యరెడ్డిని ఇరు ఫ్యామిలీలు వ్యతిరేకిస్తే తారకరత్న-అలేఖ్య రెడ్డిల వివాహం విజయ్ సాయి రెడ్డి సమర్ధించడమే కాకుండా దగ్గరుండి పెళ్లి చేసారు.
అలాంటిది అల్లుడు పొతే ఆయన రారా.. హా చంద్రబాబు శత్రువు, బాలయ్య తో పడదు. ఆయన అన్న కొడుకు పోతే నేనెందుకు వెళ్లాలని ఆయన అనుకోలేదు, శత్రువు ఇంటికొస్తే మనమెందుకు పలకరించాలని చంద్రబాబు, బాలయ్య అనుకోలేదు. తారకరత్న చనిపోవడం అటు నందమూరి, ఇటు అలేఖ్య రెడ్డి కుటుంబాలలో విషాదమే. సో విజయసాయి రెడ్డితో చంద్రబాబు అలా ఉన్నారు, చంద్రబాబుతో విజయసాయి ఇలా ఉన్నారంటూ వైసిపీ వారెవరైనా విమర్శిస్తే పోయేది వారి పరువే అంటున్నారు నెటిజెన్స్. ఇది నిజం కూడా.