పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 28 న విడుదల చేస్తామంటూ మేకర్స్ డేట్ ఎప్పుడో ఇచ్చేసారు. కానీ ఇంతవరకు సలార్ టీజర్ ఇవ్వలేదు. ప్రభాస్ ఫాన్స్ సలార్ టీజర్ పై ఎంతగా ఎదురు చూస్తున్నా.. సినిమాపై ఉన్న అంచనాలను వాళ్ళని డిస్పాయింట్ చెయ్యదని నమ్ముతున్నారు. అయితే సలార్ మూవీలో మలయాళ టాప్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించడమే ఓ స్పెషల్ అంటే.. KGF హీరో యశ్ గెస్ట్ రోల్ చెయ్యడం మరో స్పెషల్.
ఇప్పుడు ఇంకో స్పెషల్ న్యూస్ వినిపిస్తుంది. సలార్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ కమిట్మెంట్ ఉంది. ఇప్పటికే NTR31 పై ప్రకటన కూడా వచ్చింది. అయితే సలార్ ఎన్టీఆర్ వాయిస్‌తో ఎండ్ అవుతుందట. సలార్ లో ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో వాయిస్ చెప్పించడానికి కారణం.. సలార్ కి NTR30 కి ప్రశాంత్ నీల్ లింక్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అటు KGF కి సలార్ కి లింక్ అయ్యేలా యశ్ ని గెస్ట్ రోల్ లో తీసుకురాబోతున్నారనే న్యూస్ ఉండనే ఉంది. ఇప్పుడు సలార్ కి NTR30 కి లింక్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇక సలార్ ప్రమోషన్స్ ని ఆదిపురుష్ రిలీజ్ అయ్యాకే మొదలు పెట్టాలని, ఈలోపు టీజర్ వదిలి ఫాన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యాలని సలార్ మేకర్స్ చూస్తున్నారట. అయితే ప్రమోషన్స్ విషయంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు అని తెలుస్తుంది.