బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ గ్లామర్ గా కనిపిస్తుంది. అన్న ఇమ్రాన్ తో వెకేషన్స్ కి వెళ్లే సారా అలీ ఖాన్ ఆ మధ్యన ఓ బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తుంది అన్నప్పటికీ.. ఆ విషయంలో మీడియాకి పెద్దగా క్లారిటీ లేదు. సైఫ్ అలీ ఖాన్ కుమార్తె గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం తనకున్న టాలెంట్ తోనే అవకాశాలు పట్టేస్తుంది. బాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న ఈ కుర్ర బ్యూటీ ఎలాంటి అవుట్ ఫిట్ లో అయినా అద్భుతంగా కనబడుతుంది.
బాలీవుడ్ లో ప్రముఖ డిజైనర్ స్టూడియో శ్యామల్ అండ్ భూమిక వారి అవుట్ ఫిట్స్ లోను, మనీష్ మల్హోత్రా అవుట్ ఫిట్స్ లో ఎక్కువగా కనిపించే సారా అలీ ఖాన్ తాజాగా శ్యామల్ అండ్ భూమిక అవుట్ ఫిట్ లో అందంగా మెరిసిపోయింది. ఖుషి వెడ్డింగ్ అవుట్ ఫిట్ హ్యాండీ క్రాఫ్టెడ్ లెహంగాలో సారా ఆలా ఖాన్ బ్యూటిఫుల్ గా కనిపించింది. అందాలు ఆరబొయ్యకపోయినా.. ఆమె అందంగా అద్భుతంగా కనిపించింది.
బికినీ షో చేసినా గ్లామర్ గా అంతే బ్యూటిఫుల్ గా కనిపించే సారా అలీ ఖాన్ ఈ వెడ్డింగ్ డ్రెస్ లో చూసిన వారు అచ్చం పెళ్లి కూతురిలా ఉంది అంటారు. మరి మీరూ సారా కొత్త లుక్ ని ఓ చూపు చూడండి.