Advertisementt

హన్సిక బ్రేకప్ లవ్ స్టోరీ

Mon 20th Feb 2023 06:20 PM
hansika,simbu  హన్సిక బ్రేకప్ లవ్ స్టోరీ
Hansika breakup love story హన్సిక బ్రేకప్ లవ్ స్టోరీ
Advertisement
Ads by CJ

హన్సిక మోత్వానీ ఈమధ్యనే ప్రేమించిన సోహైల్ తో ఏడడుగులు నడిచింది. డిసెంబర్ లో రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న హన్సిక.. వివాహమోహోత్సవం ప్రముఖ ఓటిటి హాట్ స్టార్ నుండి బిట్స్ బిట్స్ గా టీజర్, ట్రైలర్ అంటూ ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే పూర్తి పెళ్లి వీడియో రాబోతుంది. అయితే హన్సిక పెళ్ళికి ముందు కొన్నేళ్ల క్రితమే తమిళ హీరో శింబుతో ప్రేమలో మునిగి తేలింది. చాన్నాళ్లు ప్రేమించుకున్న ఈజంట వివాహం కూడా చేసుకోబోతుంది అన్నారు. కానీ శింబు ఫాదర్ రాజేందర్ శింబు-హన్సికల పెళ్ళికి ఒప్పుకోవడం లేదన్నారు. తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. తాజాగా తన బ్రేకప్ లవ్ స్టోరీపై హన్సిక పెదవి విప్పింది.

ఒకసారి ప్రేమ బ్రేకప్ అయ్యాక మళ్ళీ ఆ ప్రేమకి ఎస్ చెప్పడానికి ఏడెనిమిదేళ్లు పట్టింది. నేను ప్రేమని నమ్ముతాను, రొమాంటిక్ పర్సన్ ని కాదు, నేను అందరికి అర్ధమయ్యేలా ఎమోషన్స్ ని చూపించలేను. నాతో లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తికి ఓకె చెప్పడానికి చాలా టైమే తీసుకున్నాను. ఎందుకంటే గత రిలేషన్ షిప్ తాలూకు గతం అలాంటిది. అయినా ఇప్పుడు అది ముగిసిన విషయం అంటూ హన్సిక శింబు పేరు ఎత్తకుండానే తన బ్రేకప్ స్టోరీని చెప్పేసింది.

ఇక హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా తన ఫ్రెండ్ మాజీ భర్తనే. తన ఫ్రెండ్ పెళ్లి చేసుకుని విడాకులిచ్చిన ముంబై వ్యాపారవేత్త సోహైల్ తో హన్సిక లవ్ లో పడి, పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచింది. 

Hansika breakup love story:

Hansika opens up about her breakup with Simbu

Tags:   HANSIKA, SIMBU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ