Advertisementt

కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు బాసు

Mon 20th Feb 2023 05:08 PM
kajal,nbk108  కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు బాసు
Kajal craze has not decreased at all కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు బాసు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తారు. పిల్లలు పుట్టినా వెనకడుగు వెయ్యరు, అవకాశాలు పోవు. అందుకు ముఖ్య ఉదాహరణ కరీనా కపూర్, అలియా భట్ లే. కానీ సౌత్ కి వచ్చేసరికి హీరోయిన్స్ కి పిల్లలు పుట్టడం అటుంచి పెళ్లి అయితేనే అవకాశాలు రావు. అందుకే ఇక్కడ దక్షిణాది హీరోయిన్స్ పెళ్లంటే వెనకడుగు వేస్తారు. త్రిష, రకుల్, తమన్నా, అనుష్క శెట్టి లాంటి హీరోయిన్స్ అందరూ ఈ కోవకే చెందుతారు. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని, సీక్రెట్ గానే బిడ్డని కన్న శ్రీయని ఇప్పుడు టాలీవుడ్ లో పట్టించుకునే దర్శక నిర్మాతే లేరు.

కానీ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని బాబుని కన్నా ఆమెకి మాత్రం ఆఫర్స్ ఇంకా ఇంకా క్యూ కడుతున్నాయి. సమంత అయితే పెళ్లి చేసుకుని టాప్ హీరోయిన్ గానే వుంది. అలాగే నయనతార రీసెంట్ గా వివాహం చేసుకున్నా ఆమెకీ పొలోమని అవకాలు వస్తూనే ఉన్నాయి. ఇక కాజల్ పెళ్లి తర్వాత కమల్ హాసన్ ఇండియన్ 2 లో చేస్తూ బిజీగా వుంది. అలాగే బాలకృష్ణ - అనిల్ రావిపూడి మూవీలోనూ కాజల్ హీరోయిన్ అంటున్నారు. ఈ సినిమా కోసం కాజల్ డిమాండ్ మాములుగా లేదట. పెళ్ళయ్యి, తల్లయితేనేమి.. తగ్గేదేలే అన్నట్టుగా పారితోషకం అడుగుతుందట.

మరోపక్క అజిత్ సినిమా ఆఫర్ రావడంతో కాజల్ పారితోషకాన్ని డబుల్ చేసిందని వినికిడి. 

పెళ్లికి ముందు కాజల్ 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకుంది. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత పారితోషికాన్ని 3 నుండి 4 కోట్ల వరకు పెంచేసిందట. అంటే కాజల్ పెళ్ళికి ముందుకన్నా పారితోషకాన్ని దాదాపు డబుల్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Kajal craze has not decreased at all:

Kajal remuneration double for NBK108

Tags:   KAJAL, NBK108
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ