నందమూరి తారకరత్న అంతిమయాత్ర మరికొద్దిసేపట్లో ఫిల్మ్ నగర్ మహాప్రస్థానానికి చేరుకోనుంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న భౌతిక కాయాన్ని తరలించిన్నపటినుండి వేలాదిమంది అభిమానులు తారకరత్న చివరి చూపు కోసం పోటెత్తారు. నందమూరి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కనిపించగా.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ భార్య, ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఇంకా సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న భౌతిక కాయం దగ్గర నివాళు అర్పించారు. నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకు తారకరత్నకి జరగాల్సిన అంతిమ సంస్కారాలని అన్న మోహన్ కృష్ణ, తారకరత్న బిడ్డల చేత చేయించారు. ఫిల్మ్ ఛాంబర్ లోనే కుటుంబ సభ్యుల మధ్యన అంతిమ సంస్కారాలు కోసం పూజలు నిర్వహించి 3 గంటలకి అంతిమయాత్ర మొదలు పెట్టారు.
సాయంత్రం ఐదు గంటలోపు తారకరత్న అంత్యక్రియలు పూర్తి చేసే ఉద్దేశ్యంలో నందమూరి కుటుంబం మొత్తం మహాప్రస్థానానికి చేరుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, తారకరత్న భార్య అలేఖ్య, ఆయన పిల్లలు అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కారు. ఇక మహాప్రస్థానానికి కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ లు చేరుకొని సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొటున్నారు. నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు, గోరంట్ల, అది శేషగిరి రావు, విజయ సాయి రెడ్డి తదితరులు తారకరత్న అంత్యక్రియలకు హాజరైన వారిలో ఉన్నారు.
ప్రస్తుతం అంతిమయాత్ర ఫిల్మ్ నగర్ మహాప్రస్థానానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లో తారకరత్న అంత్యక్రియలు ఆయన కొడుకు చేతుల మీదుగా నందమూరి కుటుంబం జరపనిశ్చయించింది.