Advertisementt

దుబాయ్ లో అల్లు ఫ్యామిలీ

Mon 20th Feb 2023 10:58 AM
allu family,allu arjun  దుబాయ్ లో అల్లు ఫ్యామిలీ
Allu family enjoys his vacation in Dubai దుబాయ్ లో అల్లు ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 2 షూటింగ్ లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో రీసెంట్ గా పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ గత వారమే వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చేసాడు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ దుబాయ్ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది. అల్లు అరవింద్, ఆయన భార్య, అలాగే అల్లు బాబీ ఆయన భార్య ఇంకా పాప, అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి, అల్లు శిరీష్ ఇలా అందరూ కలిసి దుబాయ్ వెకేషన్స్ కి వెళ్లారు. అక్కడ అల్లు ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ సందడి చేసారు.

గ్రూప్ ఫొటోస్ తో అల్లు ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ పిక్స్ లో అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలు మాత్రం కనిపించలేదు. అందరూ జంటలుగా కనిపించగా.. అల్లు శిరీష్ మాత్రం సింగిల్ గా కనిపించాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్ వెకేషన్ నుండి రాగానే.. హైదరాబాద్ లో మొదలు కాబోయే పుష్ప 2 కొత్త షెడ్యూల్ లో పాల్గొంటాడు. ఇదే షెడ్యూల్ లో రష్మిక మందన్న కూడా పాల్గొంటుంది. అలాగే మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం ఉంది. 

Allu family enjoys his vacation in Dubai:

Allu family vacation in Dubai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ