Advertisementt

ఆ మాట నువ్వే చెప్పాలి బండ్లన్నా

Mon 20th Feb 2023 09:41 AM
bandla ganesh,chandrababu  ఆ మాట నువ్వే చెప్పాలి బండ్లన్నా
Bandla Ganesh tweet on Vijay Sai Reddy and Chandrababu bonding ఆ మాట నువ్వే చెప్పాలి బండ్లన్నా
Advertisement
Ads by CJ

నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం  కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! అంటూ బండ్ల గణేష్ చంద్రబాబు-విజయ్ సాయి రెడ్డి కూర్చున్న పిక్ ని పోస్ట్ చేస్తూ చేసిన ట్వీట్ అది. నిన్న తారకరత్న ఇంటి దగ్గర పార్టీలకి అతీతంగా తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి  సినీ, రాజకీయప్రముఖులు వచ్చారు. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బాబాయ్ వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి చేరుకున్నప్పటినుండి అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో విజయ్ సాయి రెడ్డి కలిసిపోయి మట్లాడారు. 

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, చిరు, బాలకృష్ణ ఇలా ప్రతి ఒక్కరితో ఆయన మట్లాడారు. అక్కడ పార్టీ ముఖ్యమా, ఈగో ముఖ్యమా అనేది కాదు. అనుబంధం, ప్రేమ మాత్రమే ముఖ్యమని చూపించారు.

ఎప్పుడూ తిట్టే చంద్రబాబు తోనూ విజయ్ సాయిరెడ్డి మాట్లాడారు, విజయ్ సాయి రెడ్డిని విమర్శించే బాలయ్య, చంద్రబాబు అందరూ ఆయనతో అలానే ఉన్నారు. తారకరత్న అందరిని విడిచిపెట్టి వెళ్లిపోవడం అనేది బాధాకరమైన సమయం. అక్కడ పార్టీ, కోపం, ఈగో అని పెట్టుకుంటే మనిషికి మానవత్వమే లేదు అనేది అభిమానుల వాదన. కానీ బండ్ల గణేష్ మాత్రం అక్కడ శత్రుత్వాన్ని చూస్తున్నాడు తప్ప ఆత్మీయతని చూడలేదు, అనుబంధాన్ని విస్మరించాడు అనేది నందమూరి ఫాన్స్, టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో మాట్లాడను అనేది నీ అభిప్రాయం. అయినా మాట మీద నిలబడని వాడివి నువ్వే చెప్పాలి ఆ మాట అంటూ అందరూ కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి.. నువ్వా.. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడ కూడదు అన్నా అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు వారు. సార్ మీరు అప్పుడే 9 0 క్లాక్ బ్లేడ్ తో కోసుకుని ఉంటే మాకు ఈ గోల ఉండేది కాదు గా...🤦🤦. Meaning less ga మాట్లాడకు.. తారకరత్న విజయసాయిరెడ్డి అల్లుడు నందమూరి వారసుడు కష్ట కాలంలో ఒకే సమయంలో కలవాల్సి వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు నువ్వు నీ పిచ్చి ట్విట్స్ అంటూ బండ్లన్నపై ఫైరవుతున్నారు 

Bandla Ganesh tweet on Vijay Sai Reddy and Chandrababu bonding:

Bandla Ganesh tweet viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ