Advertisementt

తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత

Sun 19th Feb 2023 08:35 PM
taraka ratna,alekhya reddy  తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత
Taraka Ratna wife Alekhya Reddy falls ill తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత
Advertisement
Ads by CJ

నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినప్పటినుండి ఆయన భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న దగ్గరే ఉండిపోయింది. బాలకృష్ణ డాక్టర్స్ తో మట్లాడుతూ ఫ్యామిలీ ని చూసుకున్నారు. అలేఖ్య రెడ్డి భర్త ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటూ ఆసుపత్రిలో ఉంది. కానీ ఆమె కోరిక తీరలేదు, ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. అయితే అలేఖ్య నిన్న తారకరత్న కండిషన్ సీరియస్ అన్నప్పటినుండి ఏమి తినకుండా ఉండిపోయారట. అలాగే ఈరోజు హైదరాబాద్ తారకరత్న నివాసానికి ఆయన్ని తరలించినప్పటినుండి, అలేఖ్య భర్త భౌతిక కాయం దగ్గరే ఉండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పిల్లలని ఓదార్చుకుంటూ ఉంది.

రెండురోజులుగా ఆమె ఏమి తినకపోవడంతో అలేఖ్య అస్వస్థతకి గురైనట్టుగా తెలుస్తుంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా బాధపడుతూ ఆమె బాగా నీరసించిపోవడంతో కుటుంబ సభ్యులు అలేఖ్యని ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తారకరత్న చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, సినీ, రాజకీయ నాయకులు తారకరత్న నివాసానికి తరలివస్తున్నారు. అలేఖ్యని ఓదారుస్తున్నారు. ఆమె బాబాయ్ విజయ సాయి రెడ్డి ఉదయం నుండి అలేఖ్య దగ్గరే ఉన్నారు.

రేపు ఉదయం 7 గంటలకి తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తరలించి అభిమానుల సందర్శనార్ధం మూడు గంటలవరకు ఉంచుతారట. సాయంత్రం మూడు గంటల తర్వాత ఆయన అంతిమయాత్ర నిర్వహించి.. ఐదు గంటలకి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతాయని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు.

Taraka Ratna wife Alekhya Reddy falls ill:

Taraka Ratna wife Alekhya Reddy is in shock and disturbed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ