నందమూరి తారకరత్న గత నెల 26న లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ తో కుప్పం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయకి తరలించారు నందనమూరి కుటుంబ సభ్యులు. అయితే తారకరత్న 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ నిన్న శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే తారకరత్న మరణం ఎప్పుడో సంభవించింది. లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోతుందో.. లేదా తారకరత్న మరణాన్ని అపశకునం అంటారో అని ఆయన మృతి చెందిన విషయాన్ని చెప్పకుండా దాచారు.. అది ఇప్పుడు బయటపెట్టారు.
చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు వల్ల నందమూరి ఫ్యామిలీ చాలా నష్టపోతోంది అంటూ లక్ష్మి పార్వతి తారకరత్న మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు, లోకేష్ లకి కొమ్ము కాస్తూ ఇంకెంతమంది నందమూరి కుటుంబ సభ్యులని బలి తీసుకుంటారు, మావారు కూడా ఇలానే కుమిలి కుమిలి మరణించారు. తారకరత్న చాలా మంచివాడు, అన్యాయంగా అతను లోకేష్ పాదయత్రకి వెళ్లి ఇలా మరణించాడు, ఇలా ఎంతమంది మరణాలతో వాళ్ళ పార్టీని నడిపించుకుంటారు అంటూ లక్ష్మి పార్వతి ప్రెస్ మీట్ పెట్టింది.
తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ ఎంతో బాధలో ఉండగా.. ఇలాంటి మాటలా మాట్లాడేది.. నువ్వు ఎన్టీఆర్ భార్యవి అని చెప్పుకుంటావు. కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు ఆ ఫ్యామిలీ న్యాయం చేస్తావా వెళ్ళవమ్మా అంటూ నందమూరి అభిమానులు లక్ష్మి పార్వతి పై ఫైర్ అవుతున్నారు.