Advertisementt

చాలారోజుల తర్వాత అనుష్క ఇలా..

Sun 19th Feb 2023 02:01 PM
anushka shetty  చాలారోజుల తర్వాత అనుష్క ఇలా..
Anushka Shetty With Parents చాలారోజుల తర్వాత అనుష్క ఇలా..
Advertisement
Ads by CJ

అనుష్క ప్రస్తుతం ఎక్కువగా మీడియాకి ఫోకస్ అవ్వకుండా తన పని తాను చేసుకుపోతుంది. సైజ్ జీరో బరువు వెక్కిరిస్తున్న ఆమె దానిని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఆశ్రయించింది. ఎంతగా యోగా చేసినా అనుష్క బరువుని తగ్గించుకోలేక కామ్ అయ్యింది. ప్రస్తుతం నవీన్ పోలీస్ శెట్టి తో యువీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమా చేస్తుంది. ఆ సినిమాలో షెఫ్ అవతార్ లో అనుష్క కనిపిస్తుంది కానీ.. మునుపుటి గ్లామర్ కానీ, స్లిమ్ కానీ అనుష్కలో మాత్రం కనిపించడం లేదు.

నిశ్శబ్దం తర్వాత మీడియాలో డైరెక్ట్ గా కనిపించని అనుష్క శెట్టి.. ఇండస్ట్రీలో జరిగిన ఏ ఫంక్షన్ కి అటెండ్ అవ్వలేదు. తన ఫ్రెండ్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కన్ను మూసిన సమయంలోను అనుష్క ఆసుపత్రికి వెళ్లి పరార్శించిందే కానీ.. మీడియా ముందుకు రాలేదు. అయితే ఈ మూడేళ్ళలో అనుష్క మొదటిసారిగా కనిపించింది. అది కూడా మహా శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది. వైట్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న అనుష్క కాస్త బొద్దుగా కనిపించింది.

అనుష్క శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న వీడియోస్ ని, ఆ వీడియోలో అనుష్క పిక్స్ కి కట్ చేసి మరీ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం అనుష్క బొద్దుగా ఉండడం చూసి బాగా డిస్పాయింట్ అవుతున్నారు.

Anushka Shetty With Parents:

Anushka Shetty With Parents at Shivaratri celebrations

Tags:   ANUSHKA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ