రామ్ చరణ్ vs ప్రభాస్ vs పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే జరగబోయేలా కనబడుతుంది వ్యవహారం. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ తో సందడి చేయనున్న ప్రభాస్.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్ K ని రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ సినిమాలకి చాలా క్రేజ్ ఉంటుంది. అందులోను టాప్ దర్శకులతో చేస్తున్న సినిమాలు కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే 2024 సంక్రాంతికి ఎంతమంది ఎన్ని అనుకున్నా.. ప్రభాస్ మాత్రం ప్రాజెక్ట్ K ని సంక్రాంతికి అది కూడా జనవరి 12న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ ప్రకటించేసారు. ఇక అదే సంక్రాంతికి రామ్ చరణ్ RC15 తో రావొచ్చని వార్తలు వినబడుతున్నాయి.
అసలే దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఖచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి RC15 ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తాడు. శంకర్-రామ్ చరణ్ కలయికలో గ్రాండ్ గా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న RC15 గనక సంక్రాంతి 2024కి వస్తే.. ప్రభాస్ తో రామ్ చరణ్ గట్టిగా తలపడినట్లే. ఇక అదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పోటీ పడవచ్చు. అసలు షూటింగ్ మొదలు కాకుండానే పవన్ వచ్చేస్తాడా అంటే.. వచ్చేస్తాడని దర్శకుడు హరీష్ ఎప్పుడో చెప్పేసాడు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పాడు. కాకపోతే అఫీషియల్ గా తేదీ ఇవ్వలేదు అంతే.
అంటే 2024 సంక్రాంతికి ఇప్పటినుండే గట్టి పోటీ మొదలైపోయినట్లే. అందులోను ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ అలాగే ఒక స్టార్ హీరో పోటీ పడితే నిజంగా ఆడియన్స్ కి కిక్కు.. మేకర్స్ కి టెన్షన్. చూద్దాం ఆ సమయానికి ఇంకెంతమంది పోటీకి వస్తారో అనేది.