శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆనందం సినిమాలో నటించిన హీరో ఆకాష్ కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. మధ్యలో ఇండస్ట్రీలో కొంతమందిపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి.. మళ్ళీ ఓ సినిమా డైరెక్ట్ చేసినా ప్రేక్షకులు ఆదరించలేదు. తర్వాత వెబ్ సీరీస్ లో అడుగుపెట్టినా సక్సెస్ దొరకలేదు. దానితో ఆకాష్ ఇప్పుడు సీరియల్స్ వైపు మొగ్గు చూపాడు. ఆకాష్ కథానాయకుడిగా జెమిని ఛానల్ లో ఓ సీరియల్ రాబోతుంది
అతి త్వరలోనే మొదలు కాబోతున్న ఆ సీరియల్ పేరు అను అనే నేను. ఇది జెమిని లో ప్రసారమవడానికి సిద్దమై. ప్రస్తుతం ప్రోమోస్ వస్తున్నాయి. ఈ సీరియల్ లో తనని అవమానించే భార్యకి భర్తగా, ప్రేమించే మామకి అల్లుడిగా.. కనిపించబోతున్నాడు ఆకాష్. ఆకాష్ స్టయిల్, అతని డ్రెస్ సెన్స్ అన్ని చూడడానికి స్టయిల్ గా ఉన్నా.. అతని నేపథ్యం ఏ మిడిల్ క్లాసో అయ్యుంటుంది.. అందుకే అతని భార్య నిన్ను భర్తగా భావించను, నా దృష్టిలో పనోడివే అన్న డైలాగ్స్ అను అనే నేను ప్రోమోలో హైలెట్ అయ్యాయి.
సో సినిమా అవకాశాలు తగ్గడంతో ఆకాష్ ఇలా సీరియల్స్ కి జంప్ అయ్యాడు. మరి సీరియల్స్ లో అయినా ఆకాష్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.