నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అంటూ మీడియాలో చూసిన ఓ న్యూస్ నందమూరి అభిమానుల ఆందోళనకి కారణమైంది. తారాకరత్న గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారకరత్నకు కుటుంబ సభ్యులు విదేశీ వైద్యులని పిలిపించి చికిత్స చేయిస్తున్నట్లుగా రామకృష్ణ మీడియాకి తెలిపారు. అయినప్పటికీ తారకరత్న ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదని తెలుస్తుంది. గుండెకి అలాగే తారకరత్న మెదడుకి ప్రత్యేక వైద్యం అందిస్తున్నప్పటికీ.. రెండు రోజుల నుండి మెదడుకి చికిత్స అందిస్తున్నా.. తారకరత్న శరీరం స్పందించడం లేదు అంటున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ అంతా బెంగుళూరు నారాయణ హృదయాలయకి చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రి వద్ద మీడియా హడావిడి కనబడుతుంది. తారకరత్న ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటినుండి బాలకృష్ణ తారకరత్నతోనే ఉన్నారుకి.. తారకరత్న కొద్దిగా కోలుకోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ కి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన హడావిడిగా ఆసుపత్రికి రావడం పట్ల అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికాసేపట్లో తారకరత్న ఆరోగ్యంపై డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తారకరత్న గుండె, మెదడుతో పాటుగా.. మరికొన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అవడంతో.. ఆయన ఆరోగ్యం అంత్యంత విషమంగా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమ పరిస్థితిలో ఉండడం తో డాక్టర్స్ ప్రత్యేకంగా హెల్త్ బులిటెన్ ఈరోజు విడుదల చెయ్యాలా.. లేదంటే సోమవారం విడుదల చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.