మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. హాలీవుడ్ స్టార్స్ కొడుకు రామ్ చరణ్ ని పొగుడుతుంటే సంబరపడిపోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా పోలీస్ అధికారి గెటప్ లో, అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ నటనని హాలీవుడ్ స్టార్స్ ప్రశంసిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమరూన్ ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు రాజమౌళిని స్వయంగా అభినందించారు. అంతేకాకుండా రీసెంట్ గా ఆయన మీడియాతో మట్లాడుతూ.. ఆర్.ఆర్.ఆర్ ని మొదటిసారి చూసినప్పుడు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను, హీరోల పాత్రలు తీరుతెన్నులు, విఎఫ్ఎక్స్ వర్క్, కథ అన్నీ షేక్ స్పీయర్ క్లాసిక్ లా అనిపించింది.
రామ్ పాత్ర చాలా కష్టమైంది. ఆ పాత్ర ఛాలెంజ్ తో కూడుకున్నది. రామ్ మైండ్ లో ఏముంది అని తెలిసిన తర్వాత గుండె బరువెక్కింది. ఈమధ్యనే రాజమౌళిని కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను అంటూ మాట్లాడారు. అది చూసిన మెగాస్టార్ ఎమోషనల్ అవుతూ కెమరూన్ కి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ రామ్ పాత్రని ప్రముఖ హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కెమరూన్ ప్రశంసించడం ఎంతో సంతోషంగా వుంది. గ్లోబల్ స్టార్, సినిమాటిక్ జీనియస్ అయిన జేమ్స్ కెమరూన్ అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే. జేమ్స్ కెమరూన్ ప్రశంశలు చరణ్ కి దీవెనలు, రామ్ చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా.. తండ్రిగా నేనెంతో గర్వపడుతున్నా అంటూ చిరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్యన యుద్దానికి దారి తీసింది.
కారణం ఆ సినిమాలో యంగ్ టైగర్ కూడా నటించాడు. ఎన్టీఆర్ భీమ్ కేరెక్టర్ ని చాలామంది మెచ్చుకున్నారు. కానీ చిరు ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా రామ్ చరణ్ నే పొగడడం పట్ల నందమూరి, ఎన్టీఆర్ ఫాన్స్ చిరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మెగా ఫాన్స్ కూడా వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. జేమ్స్ కెమరూన్ మెచ్చుకున్నది చరణ్ ని, అందుకు చిరు గర్వపడుతున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఇక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అంటూ స్పందిస్తున్నారు.