ప్రభాస్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది నిజమైంది. మహా శివరాత్రికి ప్రాజెక్ట్ K నుండి అప్ డేట్ అది కూడా రిలీజ్ డేట్ రాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నా వైజయంతి మూవీస్ కానీ, ప్రభాస్ కానీ, నాగ్ అశ్విన్ కానీ స్పందించలేదు. హా ఇది కూడా ఫాన్స్ హడావిడే తప్ప అప్ డేట్ ఏం ఉండదు. ప్రాజెక్ట్ K నుండి ఇప్పుడప్పుడే ఎలాంటి అప్ డేట్ వచ్చే అవకాశమే లేదు అన్నారు కొందరు. కానీ ఫాన్స్ గెస్ చేసింది నిజమే, వైజయంతి మూవీస్ వారు ఎలాంటి హడావిడి లేకుండా ఫాన్స్ కోరికని కూల్ గా తీర్చేసారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కలయికలో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ వచ్చేసింది.
2024 జనవరి 12 న ప్రాజెక్ట్ K ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తామంటూ అఫీషియల్ గా పోస్టర్ తో ప్రకటించారు మేకర్స్. మేకర్స్ నుండి ఎలాంటి క్లూ లేకపోయినా.. ప్రభాస్ ఫాన్స్ ఆశపడినట్లుగా ప్రాజెక్ట్ K రిలీజ్ తేదీని గ్రాండ్ గా మహాశివరాత్రి స్పెషల్ గా ప్రకటించింది టీమ్. వచ్చే సంక్రాంతికి అఫీషియల్ గా బరిలోకి దిగుతున్నట్టుగా ప్రకటించిన మొదటి సినిమా కూడా ప్రాజెక్ట్ K కావడం గమనార్హం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కే ఏడెనిమిది నెలల సమయం పడుతున్న కారణంగా సినిమాని 2024 ప్రథమార్ధానికి రిలీజ్ చేస్తున్నారు.
బాలీవుడ్ తారాగణం దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీ చూసిన ప్రభాస్ ఫాన్స్ మహా శివరాత్రిని స్పెషల్ గా జరుపుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు.