కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ నేడు శివరాత్రి పండుగ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. గీత ఆర్ట్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థనుండి వస్తున్న సినిమా కావడం, అలాగే వినరో భాగ్యము టీమ్ చేసిన ప్రమోషన్స్ కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడినాయి. అందులోను మేకర్స్ తమ సినిమా మీద నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్ నిర్వహించడం కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి.
గత రాత్రి ప్రీమియర్స్ పూర్తి చేసుకుని నేడు థియేటర్స్ లోకి అడుగుపెట్టిన వినరో భాగ్యము విష్ణు కథకి మిక్స్డ్ రివ్యూస్ రాగా.. ఆడియన్స్ నాట్ వెంట కూడా అదే మాట వినిపిస్తుంది. అయితే ఈ చిత్ర డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. వినరో భాగ్యముయ్ విష్ణు కథ థియేటర్ రన్ క్లోజ్ అవ్వగానే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు రాబోతుందన్నమాట.