Advertisementt

నటి గీతా సింగ్ ఇంట పెను విషాదం

Sat 18th Feb 2023 08:55 AM
kithakithalu,actress geetha singh  నటి గీతా సింగ్ ఇంట పెను విషాదం
Actress Geetha Singh son dies నటి గీతా సింగ్ ఇంట పెను విషాదం
Advertisement
Ads by CJ

నటి గీతా సింగ్ అంటే తెలియని వారుండరు. కేరెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు, EVV సత్యతన్నారాయణ సినిమాలలో గీతా సింగ్ ఎక్కువగా కనిపించేది. అల్లరి నరేష్ కి హీరోయిన్ గా కితకితలు సినిమాలో నటించిన గీతా సింగ్.. ఈమధ్యన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు బుల్లితెర స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కనిపించే గీతా సింగ్ ఉన్నట్టుండి వార్తల్లో నిలిచింది. కారణం గీతా సింగ్ పెద్దకుమారుడు రోడ్ యాక్సిడెంట్ లో మరణించడమే. అదేమిటి గీతా సింగ్ కి వివాహం కాలేదు కదా.. ఆమెకి కొడుకు ఎక్కడినుండి వచ్చాడు అనుకోవచ్చు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కుంటున్న గీతా సింగ్.. తన అన్న కుమారులని దత్తత తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 

పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న గీతా సింగ్ తన అన్న కొడుకులే తన కొడుకులుగా బ్రతుకుతున్న తరుణంలో ఆమె ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. గీతా సింగ్ పెద్ద కుమారుడు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో దుర్మరణం పాలయ్యారు.. ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని తెలుస్తుంది. గీతా సింగ్ కుమారుడి పేరు, వివరాలు తెలియాల్సి ఉంది.

Actress Geetha Singh son dies:

 Kithakithalu actress Geetha Singh son died in an accident 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ