సోషల్ మీడియాలో హీరోల అభిమానులు సినిమా అప్ డేట్స్ కోసం చేసే రచ్చ చూస్తున్నాము, ప్రభాస్ రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ యువీ నిర్మాణ సంస్థని నానా తిట్లు తిట్టేవారు. చిన్నదానికి పెద్ద దానికి అభిమానులు రెచ్చిపోయి నిర్మాణ సంస్థలపై పడుతున్నారు. ఈ ఇబ్బంది తట్టుకోలేక చాలామంది డైరెక్టర్స్ సోషల్ మీడియాకి దణ్ణం పెట్టేసారు. అయినప్పటికీ హీరోల ఫాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ చెయ్యడం అటుంచి సినిమా అప్ డేట్స్ కోసం ఇలాంటి యుద్దాలు మొదలు పెట్టారు.
రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమాలకే కాదు, మిగతా హీరోల అభిమానులని కలిపి వార్న్ చేసాడు. అప్ డేట్స్ కోసం పదే పదే నిర్మాతలని ఇబ్బంది పెడితే ఒత్తిడికి గురవుతారు. మా సినిమా అప్ డేట్స్ మా భార్య కన్నా ముందు మీకే చెబుతామని అన్నాడు. అంతకుముందు NTR30 అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో అంతా ఇంతా కాదు. NTR30 నిర్మించే యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ని తిట్టిపోస్తున్నారు.
కానీ ఎన్టీఆర్ తన ఫాన్స్ కి అలా చెప్పాడో.. లేదో ఇలా సైలెంట్ అయ్యిపోయారు. ఈ నెలలో ఎలాగూ సినిమా ఓపెనింగ్ అని ఎన్టీఆర్ చెప్పేసాడు. సో అది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు తప్ప హడావిడి చేయడం లేదు. ఇక రేపు శివరాత్రి రోజు NTR30 అప్ డేట్ కోసం ఈరోజే నుండే ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా మొదలుపెట్టి రచ్చ స్టార్ట్ చేసేవారు. కానీ ఎన్టీఆర్ చెప్పాడని ఒక్క కారణంతోనే వారు కామ్ అయ్యారు. నిజంగా ఎన్టీఆర్ ఫాన్స్ గ్రేట్ అంటున్నారు నెటిజెన్స్.
మిగతా హీరోల అభిమానులు కూడా ఇంతే క్రమ శిక్షణతో ఉండాలని కోరుకుంటున్నారు. హీరోలంటే అభిమానం ఉండొచ్చు, కానీ అది హద్దులు దాటిపోకూడదనేది అందరి అభిప్రాయం. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే.. నిజంగా సూపరే.