Advertisementt

శ్రీరామనవమికి ఆదిపురుష్ టీజర్

Fri 17th Feb 2023 11:59 AM
adipurush trailer,prabhas  శ్రీరామనవమికి ఆదిపురుష్ టీజర్
Adipurush Teaser for Sri Rama Navami శ్రీరామనవమికి ఆదిపురుష్ టీజర్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ తెరకెక్కించారు. ఆదిపురుష్ అంటే రాముడి గా ప్రభాస్ ని ఊహించుకున్న ఫాన్స్ కి ఆడియన్స్ కి షాకిస్తూ ఓమ్ రౌత్ ప్రభాస్ ని యానిమేటెడ్ లుక్ లో టీజర్ రిలీజ్ చేసేసరికి ఫాన్స్ షాకవగా.. నెటిజెన్స్ ఆదిపురుష్ టీజర్ ని తెగ ట్రోల్ చేసారు. ప్రభాస్ ని యానిమేటెడ్ రాముడిగా చూసేసరికి ఫాన్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ దెబ్బకి ఆదిపురుష్ మేకర్స్ సినిమా రిలీజ్ ని వాయిదా వేసి, బెస్ట్ విఎఫెక్స్ వర్క్ అంటూ సినిమాని జూన్ కి షిఫ్ట్ చేసారు.

అప్పటినుండి ఆదిపురుష్ టీమ్ సైలెంట్ గా పని చేసుకుంటుంది కానీ ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టనే లేదు. అయితే రాముడికి అత్యంత ప్రీతికరమైన రోజు శ్రీరామనవమి. గత ఏడాది నవమికి ప్రభాస్ రాముడు లుక్ ని ఎక్స్పెక్ట్ చేసారు ఫాన్స్. కానీ ఓమ్ రౌత్ లైట్ తీసుకున్నారు. కానీ ఈ ఏడాది శ్రీరామ నవమికి మాత్రం ఆదిపురుష్ నుండి స్పెషల్ టీజర్ ఇవ్వబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి మొదలయ్యింది. 

మరి ఏప్రిల్ లో రాబోయే శ్రీరామనవమికి నిజంగా ఆదిపురుష్ నుండి టీజర్ వస్తే ఫాన్స్ కి పండగే. అది ఫాన్స్ ని మెప్పించాలని వారు ఆశపడుతున్నారు. జూన్ లో విడుదల కాబోయే ఆదిపురుష్ ప్రమోషన్స్ ఏప్రిల్ శ్రీరామనవమికి మొదలు పెడితే జూన్ కల్లా జనాల్లోకి తీసుకెళ్లే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Adipurush Teaser for Sri Rama Navami:

Adipurush Trailer On Rama Navami

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ