గత ఏడాది దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ ని తమ సంప్రదాయంలో వివాహం చేసుకున్న నటి పూర్ణ తల్లికాబోతుంది. సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన పూర్ణ.. తర్వాత కూడా పలు బుల్లితెర షోస్ లో కనిపించింది. ఢీ డాన్స్ షోకి జెడ్జ్ గా వస్తున్న పూర్ణ కొద్దిరోజులుగా కనిపించడం లేదు. అంటే కొత్త సీజన్ వచ్చాక శ్రద్ద దాస్-శేఖర్ మాస్టర్ లే జెడ్జ్ ప్లేస్ కనిపించారు. కానీ పూర్ణ మాత్రం అప్పటినుండి బుల్లితెర పై కనిపించలేదు. అయితే ఈమధ్యన పూర్ణ తల్లి కాబోతున్న విషయంతో పాటుగా కుటుంబ సభ్యులు ఆమెకి ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.
దానితో ఆమెకి అందరూ శుభాకాంక్షలు తెలియజేసారు. తర్వాత పూర్ణ బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీని తమకంతో చూస్తూ, ఆనందంతో పొంగిపోతున్న పూర్ణ.. బేబీ బంప్ మాత్రమే కాదు.. బేబీ పింక్ ఫ్రాక్ లో తల్లవుతున్న మధుర క్షణాలని అనుభవిస్తుంది. చేతుల నిండా పండిన గోరింటాకుతో మెరిసిపోయింది. ప్రస్తుతం పూర్ణ బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.