ప్రభాస్-నాగ్ అశ్విన్ కలయికలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. లెజెండరీ నటుడు అమితాబ్ ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ K షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయినా.. దాని ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ వర్క్ కి చాలా సమయం పడుతుంది అంటూ అశ్వినీ దత్ చెప్పారు. అందుకే 2024 లో ప్రాజెక్ట్ K రిలీజ్ అవుతుంది అని ఆయన అన్నారు. అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది కాబట్టి.. ఏడాది ముందుగానే రిలీజ్ డేట్ ఇచ్చేందుకు మేకర్స్ చూస్తున్నారట.
అది కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ K ని పలు లాంగ్వేజెస్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసి డేట్ ఖరారు చేయబోతున్నారట. ప్రాజెక్ట్ K విడుదలవుతుంటే.. కను సన్నల్లో హాలీవుడ్ నుండి, బాలీవుడ్ నుండి ఎలాంటి సినిమా కూడా విడుదల కాకుండా ఉండేటట్టు చూసుకుని తేదీ నిర్ణయించబోతున్నారట. అయితే 2024 సంక్రాంతి కి ప్రాజెక్ట్ K విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని చూస్తున్నారట.
ఇప్పుడు అదే విషయాన్ని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సడన్ గా ట్రెండ్ అవుతున్న ప్రాజెక్ట్ K హాష్ టాగ్ చూస్తే శివరాత్రికి ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ పై ప్రకటన వచ్చే అవకాశం, సస్పెన్స్ వీడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.