నందమూరి తారకరత్న ఇంకా కోమాలోనే ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తారకరత్నని కోమాలో నుండి బయటికి తీసుకురావడానికి నారాయణ హృదయాల వైద్యులే కాదు.. విదేశీ వైద్యులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నని కుటుంబ సభ్యులు విదేశాలకి తరలిస్తున్నారని అన్నప్పటికీ.. అక్కడికి తీసుకెళ్లడం సేఫ్ కాదని భావించి అక్కడి వైద్యులనే ఇండియాకి రప్పించారు
అయితే ప్రస్తుత్యం తారకరత్న హెల్త్ కండిషన్ పై ఎలాంటి క్లారిటీ లేదు. అసలాయన కోమాలో నుండి బయటికి వచ్చారా అనే విషయంపై కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఈ రోజు గురువారం ఉదయం తారకరత్న బ్రెయిన్ స్కాన్ చేశారని, ఆయనను కోమా నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం విదేశీ వైద్యులు చేస్తున్నారని.. తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ ద్వారా కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే తారకరత్న హెల్త్ అప్ డేట్ పై మీడియాలో ప్రచారం జరుగుతున్న న్యూస్ లని తారకరత్న సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. తారకరత్న నెమ్మదిగా కోలుకుంటున్నాడని, తారకరత్న ఆరోగ్యంపై డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.