కిర్రాక్ ఆర్పీ కాస్తా చేపల పులుసు ఆర్పీ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కబుర్లే వినిపిస్తున్నాయి. స్టుడెంట్స్ దగ్గరనుండి సాఫ్ట్ వెర్ ఉద్యోగుల వరకు, ఆఖరికి ఫామిలీస్ కూడా కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు ఓసారి రుచి చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యేలా యూట్యూబ్ ఛానల్స్ ఆర్పీ చేపల పులుసుని ఫెమస్ చేసాయి. కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టిన రెండు నెలలకే మణికొండ లో గ్రాండ్ గా షాప్ ఓపెన్ చేసాడు. గత వారం రోజులుగా ఆర్పీ చేపల పులుసు గురించి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.
ఇక కూకట్ పల్లి, మణికొండ తర్వాత అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్ లలో ముందు చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను అని చెప్పిన ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాండ్ పేరుతొ ఫ్రాంచైజీ ఇస్తారా అని అడిగితే.. నాకు విజయవాడ, కర్నూల్, బెంగళూర్ ఇలా చాలా చోట్ల నుండి ఫోన్స్ వస్తున్నాయి ఫ్రాంచైజీ కావాలని, ముందు అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ బ్రాంచ్ లు ఓపెన్ చేసిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తాను, తప్పకుండా ఫ్రాంచైజీ ఇస్తాము.
వాళ్ళకి వంట మాస్టర్స్ కూడా మేమె పంపిస్తాము, అలాగే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కి సంబందించిన ఇంగ్రిడియాన్స్ లో ఆ పొడి ఎవరికీ చెప్పను, వాళ్ళకి చేపల పులుసు ఎలా చెయ్యాలో నేర్పించి మరీ ఫ్రాంచైజీ లు ఇస్తాను అంటూ ఆర్పీ చెప్పుకొచ్చాడు.