త్రివిక్రమ్ ఎప్పుడూ స్టార్ హీరోలతో సేఫ్ గేమ్ ఆడతాడు. అది కూడా సాలిడ్ కథలతో తన స్టయిల్లోనే సినిమాలు చేసి హీరోలకి హిట్స్ ఇస్తాడు. కానీ తన మార్క్ కి వ్యతిరేఖంగా చేసిన ఎన్టీఆర్ అరవింద సమేత కూడా ప్రేక్షకులకి నచ్చింది.. అయినా అది త్రివిక్రమ్ స్టయిల్లో లేదు అంటారు. ఇక అజ్ఞాతవాసి సరేసరి. అదసలు త్రివిక్రమ్ స్టయిల్ కాదు, పవన్ చెడగొట్టాడు అంటారు. అదలాఉంటే అలా వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ మహేష్ తో SSMB28 చేస్తున్నాడు. ఈ మూవీ ఫినిష్ అయ్యాక త్రివిక్రమ్ కి వేరే కమిట్మెంట్స్ ఏమి లేదు.
సితార నాగ వంశీ మాత్రం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక పౌరాణిక సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లుగా చెప్పడంతో అందరిలో ఈ ప్రాజెక్టు పై అంచనాలు మొదలవడం అటుంచి.. ఆ సినిమా ఊహించని స్థాయిలో ఉంటుంది అంటూ నాగవంశీనే అంచనాలను క్రియేట్ చేశాడు. ఇప్పటికే యమదొంగలో ఎన్టీఆర్ యముడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆయన అభిమానులకే కాదు.. ఆ మూవీలో ఎన్టీఆర్ గెటప్ అందరికి తెగ నచ్చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే పౌరాణిక చిత్రం ఎలా ఉంటుంది, ఏ నేపధ్యాన్ని తీసుకోబోతున్నారో అనేది తెలియదు కానీ..
అసలు త్రివిక్రమ్ అలాంటి చిత్రాల జోలికి వెళతారా, తన జోన్ నుండి బయటికి వస్తారా.. ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ తో చెయ్యాలని ఉన్నా త్రివిక్రమ్ కి సాధ్యమవుతుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. అసలు ఈ కాంబో అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది.. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఇదే ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. అదే పౌరాణిక చిత్రం అని అధికారికంగా ఎనౌన్సమెంట్ వస్తే విషయం మాములుగా ఉండదు.