Advertisementt

యంగ్ లుక్ లో రామ్ చరణ్

Thu 16th Feb 2023 11:13 AM
ram charan,rc 15  యంగ్ లుక్ లో రామ్ చరణ్
Ram Charan in a young look యంగ్ లుక్ లో రామ్ చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో సిక్స్ ప్యాక్ బాడీ తో అదిరిపోయే మీసకట్టుతో అద్భుతంగా కనిపించాడు. ధ్రువ తర్వాత రామ్ చరణ్ లుక్ మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ లోనే అభిమానులని బాగా ఇంప్రెస్స్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ జాతర ఏడాదిగా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. షూటింగ్ మొదలై ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ఇంతవరకు టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఇవ్వకుండానే మేకర్స్ అభిమానులని తెగ వెయిట్ చేయిస్తున్నారు. అభిమానులు మాత్రం ఎందుకూరుకుంటారు. వీలైనప్పుడల్లా RC15 షూటింగ్ స్పాట్ నుండి చరణ్ లుక్ లీక్ చేసి వైరల్ చేస్తున్నారు.

అదలాఉంటే రామ్ చరణ్ శంకర్ మూవీలో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి ఎజెడ్ కేరెక్టర్, మరొకటి స్టూడెంట్ కేరెక్టర్. ఇప్పటికే ఈ రెండు పాత్రల లుక్స్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయ్యాయి. అయితే తాజాగా రామ్ చరణ్ యంగ్ లుక్ లో కనిపించాడు. RC15 సాంగ్ షూట్ వైజాగ్ గాజువాక ప్రాంతాల్లో చిత్రీకరణ జరగడంతో టీడీపీ నాయకుడు మెగాస్టార్ అభిమాని ఘంటా శ్రీనివాసరావు RC15 సెట్స్ కి వెళ్లారు. రామ్ చరణ్ అలాగే శంకర్ లకి పుష్ప గుచ్చాలు ఇచ్చారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోస్ లో రామ్ చరణ్ మరీ యంగ్ గా స్టూడెంట్ లుక్ లో అదరగొట్టేసాడు. 

మెగా ఫాన్స్ అయితే చరణ్ నీ ఏజ్ ఎంతో చెప్పడం కష్టం సుమీ అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత శంకర్ ఇండియన్ 2 షూటింగ్ కి షిఫ్ట్ అవుతారు. చరణ్ రిలాక్స్ అవుతాడు.

Ram Charan in a young look:

Ram Charan new look in RC15

Tags:   RAM CHARAN, RC 15
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ