ఒకప్పుడు ఇండస్ట్రీకి బంపర్ హిట్స్ ఇచ్చిన టాప్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పరిస్థితి ఇప్పుడు అస్సలేం బాగోలేదు. ఇండస్ట్రీ సక్సెస్ చుట్టూ తిరుగుతుంది, సక్సెస్ ఉంటేనే పలకరిస్తారు, ప్లాప్ లో ఉంటే కనీసం కన్నెత్తి చూడరు అంటూ కృష్ణవంశీ ఓపెన్ గానే చెబుతారు. మంచి మంచి హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు మరుగున పడిపోతున్నాడా అనిపించేలా ఉంది ఆయన తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రం పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా రంగమార్తాండ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఎన్నో నెలలవుతుంది. మెగాస్టార్ సపోర్ట్ ఉంది.
ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ, అనసూయ లాంటి స్టార్స్ ఉన్నారు. బ్రహ్మి లాంటి కమెడియన్ ఉన్నారు. అయినా రంగమార్తాండకి మోక్షం కలగడం లేదు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్స్ ఆల్మోస్ట్ ఫినిష్. అయినా సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కృష్ణవంశీ పోస్ట్ లు పెడుతున్నారు.. వరసగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. సినిమాని మాత్రం రిలీజ్ చెయ్యడం లేదు.
సినిమా రిలీజ్ వెనుక చిక్కులేమైనా ఉన్నాయా.. ఇలాంటి టాప్ డైరెక్టర్ కి ఇలాంటి గతా అంటూ నెటిజెన్స్ కూడా జాలిపడుతున్నారు. గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం సినిమాల దెబ్బకి కృష్ణవంశీ తో సినిమాలు చేసేందుకు హీరోలెవరు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ రీమేక్ తో అయినా ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసి ఫామ్ లోకి వద్దామనుకుంటే.. ఆ సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రమోషన్స్ చేస్తున్నారు ఓకె.. రిలీజ్ ఎప్పుడు అంటూ నెటిజెన్స్ కూడా తొందరపడుతున్నారు.