టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరనేది ఇప్పటికి ఎవ్వరూ పర్ఫెక్ట్ గా చెప్పలేని సమాధానం. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ కి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలా హీరోయిజం కి సంబందించిన నెంబర్ వన్ చైర్ ఎవరి దగ్గరా ఆగడం లేదు. కానీ ఓరామ్యాక్స్ సంస్థ మాత్రం టాలీవుడ్ హీరోలకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ని బట్టి వాళ్ళకి ర్యాంక్ లని నిర్ణయిస్తుంది. అది కూడా ఏడాదికో ఆరు నెలలకో కాదు. నెలకోసారి ఓరామ్యాక్స్ సంస్థ తెలుగు నుండి హిందీ వరకు హీరోలకి ర్యాంక్ లు కేటాయిస్తుంది.
మరి నెలకో హీరో టాప్ 1లో ఉంటే.. జనవరి నెలకు గాను.. ఓరామ్యాక్స్ సంస్థ సర్వే లో ప్రభాస్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాన్ ఇండియా సినిమాలు, ఆ సినిమాల అప్ డేట్స్ తో ప్రభాస్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. ఇక నెంబర్ 2లో ట్రిపుల్ ఆర్ హీరో ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా జనవరి నెలలో నాటు నాటు సాంగ్ అవార్డు వేడుకలో అమెరికాలో హడావిడి చేసాడు. ఇక మూడో స్థానంలో ట్రిపుల్ ఆర్ మరో హీరో రామ్ చరణ్ ఉన్నాడు. ఆయన తండ్రి కాబోతున్న వార్త, అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ అవార్డు వేడుకలో హైలెట్ అయ్యాడు. ఇక తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు.
మహేష్ బాబు ఐదో స్థానానికి పడిపోగా.. ఆరో స్థానంలోకి పవన్ తగ్గారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న మెగాస్టార్ ఏడో స్థానంలోనూ, నాని ఎనిమిదో స్థానంలో, ఇక టాప్ 10 లో పెద్దగా కనబడని రవితేజ మొదటిసారి ఈ సర్వే లో టాప్ 10 లో తొమ్మిదో స్థానంలోకి వచ్చాడు. ఇక పదో స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు.