Advertisementt

NTR30: జాన్వీ కపూర్ ఫోటోషూట్ కంప్లీట్?

Wed 15th Feb 2023 07:40 PM
janhvi kapoor,ntr 30  NTR30: జాన్వీ కపూర్ ఫోటోషూట్ కంప్లీట్?
NTR30: Janhvi Kapoor Photoshoot Complete? NTR30: జాన్వీ కపూర్ ఫోటోషూట్ కంప్లీట్?
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే NTR30 ఓపెనింగ్ కి ముహూర్తము కుదిరింది. అది ఫిబ్రవరి 24 న హైదరాబాద్ లో NTR30 ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ ఈరోజు బుధవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ మరో గుడ్ న్యూస్ చెప్పాడు. ఆ న్యూస్ నిజమైతే ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే.

NTR30 లో ఎన్టీఆర్ తో బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంపిక, అందుకు తగిన ఫార్మాలిటీస్ కొరటాల కంప్లీట్ చేసారనే టాక్ నడుస్తుంది.. ఇప్పుడు శంషాబాద్ స్టూడియో లో వారం రోజుల క్రితమే జాన్వీ కపూర్ లుక్ టెస్ట్, అలాగే ఫొటో షూట్ చేసింది NTR30 టీమ్ అంటూ ట్వీట్ చెయ్యడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఆ ట్వీట్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇది అఫీషియల్ కాదు, అయినా ఆ ట్వీట్ ని ఎన్టీఆర్ ఫాన్స్ లైక్స్, షేర్స్ తో అదరగొడుతూ హడావిడి మొదలు పెట్టారు.

అయితే NTR30 పూజా కార్యక్రమం సమయానికి జాన్వీ కపూర్ NTR30 హీరోయిన్ అని ఫైనల్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మార్చ్ 20 నుండి NTR30 రెగ్యులర్ షూట్ కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

NTR30: Janhvi Kapoor Photoshoot Complete?:

Janhvi Kapoor to make Telugu debut with NTR 30?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ