అనసూయ భరద్వాజ్ ఇది వెండితెర ప్రేక్షకులకి, బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం చెయ్యక్కర్లేని పేరు. అందమైన అనసూయ గ్లామర్ షో చేస్తే.. కామెడీ షో కి కూడా విపరీతమైన క్రేజ్, అద్భుతమైన గ్లామర్ వచ్చేస్తుంది. అనసూయ ఐటెం సాంగ్ చేసినా.. లేదంటే నెగెటివ్ రోల్ లో కనిపించినా ఆ ఆకర్షణే వేరు. అయితే అనసూయ ఎంత కూల్ గా సినిమాలు, బుల్లితెర షో లు చేసుకుంటుందో.. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్స్ పట్ల అంత వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. ఎదుటి మనిషి ఎవ్వరన్నది అనసూయ లెక్క చెయ్యదు.
ప్రేముకుల దినోత్సవం సందర్భంగా అనసూయ తన భర్త తో కలిసున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ తో పాటుగా నీతో జీవితం క్రేజీగా, రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ ట్వీట్ పై స్పందించిన నెటిజెన్.. అంతలేదులే అక్కా.. వాడి దగ్గర డబ్బు ఉంది అంతే అంటూ కాస్త వల్గర్ గా కామెంట్ చేసాడు. దానితో తిక్కరేగిన అనసూయ ఆ నెటిజెన్ కి ఎడా పెడా ఇచ్చిపడేసింది.
ఎంతుందేంటి డబ్బు.. ఆ డబ్బు నా దగ్గర లేదా, అందేంట్రా తమ్ముడూ బావగారిని వాడు, వీడు అనొచ్చా అంటూ వెటకారంగా జవాబు చెప్పిన అనసూయ చివరిగా అసలు ఏం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నా చెప్పులతో నీ చెంపలేస్తా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నానితో అనసూయకి కాలింది-నెటిజెన్ కి మూడింది అంటూ నెటిజెన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.