టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటించే యాక్షన్ మూవీస్ హిందీ యూట్యూబ్ లో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ వ్యూస్ తో మేకర్స్ కి కాసుల వర్షం కురిపించేవి. ఇక పుష్ప అయితే హిందీలో 100 కోట్లు పైనే కొల్లగొట్టి అల్లు అర్జున్ స్టామినా పవర్ చూపించింది. అల్లు అర్జున్ కి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన అలా వైకుంఠపురములో మాత్రం హిందీ రీమేక్ వెల వెల బోతుంది. అక్కడ షెహజాదా గా కార్తిక్ ఆర్యన్-కృతి సనన్ కలయికలో రీమేక్ అయిన మూవీ రేపు 17 న రిలీజ్ కాబోతుంది.
అలా వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్-అల్లు అర్జున్ లు అద్భుతమైన హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ సినిమాని హిందీలో కార్తీక్ ఆర్యన్ రీమేక్ చెయ్యగా.. విడుదలకు సిద్దమైనా ఆ మూవీ పై హిందీ ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ట్రేడ్ లో బజ్ కూడా లేదు. బుకింగ్స్ ఓపెన్ అయినా.. అస్సలు టికెట్స్ తెగడం లేదు. బుక్ మై షో ఓపెన్ చేస్తే.. ఒక్క థియేటర్స్ లో కూడా ఫుల్ అవ్వలేదు. చాలా పూర్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా హిందీలో ఎలా ఆడుతుందో అనే అనుమానాలు మొదలయ్యాయి.
షారుఖ్ ఖాన్ పఠాన్ తో బాక్సాఫీసుని షేక్ చేసి పడేసారు. కార్తీక్ ఆర్యన్ మూవీ కూడా సూపర్ హిట్ అయితే బాలీవుడ్ బాక్సాఫీసు కళకళలాడుతుంది అనుకుంటే.. షెహజాదా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే బాలీవుడ్ కి నీరసమొచ్చేస్తుంది. చూద్దాం సినిమా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది.