చాలామంది హీరోయిన్స్, హీరోలు సింగిల్ స్టేటస్ ని మెయింటింగ్ చేసినా.. ప్రేమికుల రోజుని సెలెబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది పెళ్లి తర్వాత కూడా ప్రేమికుల రోజుని జరుపుకుంటారు. మరి డేటింగ్ లో ఉండి, ప్రేమలో మునిగి తేలే జంటల విషయం చెప్పక్కర్లేదు. వాలంటైన్స్ డే సందర్భంగా రెచ్చిపోయి పార్టీలు, ముద్దులు, హగ్గులు అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రేమికుల రోజు పోస్ట్ లు చేస్తారు.
నిన్న మంగళవారం వాలెంటైన్స్ డే రోజు శృతి హాసన్ తన ప్రియుడు శాంతను ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా లో నువ్వు చాలా ఉత్తముడివి, నా హృదయం నీతోనే.. నా ప్రతి ఆలోచనల్లో నువ్వే ఉన్నావు. నాకు వెలుగునందించిన సూర్యుడివి కూడా నువ్వే. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఉండదు.. అంటూ పోస్ట్ చేసింది. మరి అంత ప్రేమతో శృతి హాసన్ రాసిన నోట్ కి ఆమె ప్రియుడు శాంతను కూడా అదే రేంజ్ ప్రేమతో స్పందించాడు.
నా ప్రేయసివి నువ్వే, నా హృదయం నువ్వే, నా కడలివి నువ్వే, నా సూర్యుడివి నువ్వే, నువ్వు చాలా ఉత్తమం అంటూ కవితతో శృతి హాసన్ ట్వీట్ కి రీ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం శృతి హాసన్ ఆమె ప్రియుడి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.