యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజులుగా గెడ్డం పెంచి కనిపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లోనే కాదు, ఇప్పుడు ఎక్కడ పబ్లిక్ లో కనిపించినా గెడ్డం లుక్ లోనే కనిపిస్తున్నారు. కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ ఎలా మేకోవర్ అవుతారో.. అలానే గెడ్డంతో కనిపిస్తారేమో అనే ఆతృతలో, క్యూరియాసిటిలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడొక యంగ్ స్టార్ కూడా ఎన్టీఆర్ లుక్ లోకి మారిపోయాడు. అతనే రామ్ పోతినేని. తాజాగా ఎయిర్పోర్ట్ లో రామ్ పోతినేని ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉన్నారో అచ్చం అలా కనిపించాడు.
బోయపాటి శ్రీను తో కొత్త సినిమాని పాన్ ఇండియా స్టయిల్లో మొదలు పెట్టిన రామ్.. ఆ సినిమా కోసం స్టైలిష్ గానే కాదు కాస్త మాస్ గా మేకోవర్ అయినట్లుగా తాజా లుక్ చూస్తే తెలుస్తుంది. గెడ్డం బాగా పెంచి బాగా సన్నగా కనిపిస్తున్నాడు. పై పిక్ చూడండి. రామ్ ని అలా ఆ యాంగిల్ లో సైడ్ నుండి చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ కి జిరాక్స్ లా అనిపించడం లేదు.. నెటిజెన్స్ కూడా అదే చెబుతున్నారు. రామ్ ఏమిటి ఎన్టీఆర్ స్టయిల్లో అని.
ఇక రామ్-బోయపాటి మూవీ లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. రామ్ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఫస్ట్ టైమ్ అడుగుపెడుతున్నాడు. చూద్దాం రామ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో అనేది.