పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా నలిగిపోతున్నారు. సినిమా షూటింగ్స్ కూల్ గా చేసుకోవడానికి లేదు, మధ్య మధ్యలో పొలిటికల్ గా బిజీ అవ్వాల్సిన పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ సమస్యల వలయంలో ఉన్నారనేది. ఇప్పుడు పవన్ మరో సమస్యలో ఇరుక్కున్నారు. అది ఆయన మాజీ వైఫ్ రేణు దేశాయ్ కి ఉన్న ఆరోగ్య సమస్య వలన. పవన్ కళ్యాణ్ భార్యకి విడాకులిచ్చేసి ఇద్దరి పిల్లలు అకీరా, ఆద్యల బాధ్యతని రేణు దేశాయ్ కి ఇచ్చారు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు లైక్ వెకేషన్స్ కి, పిల్లల పుట్టిన రోజులకి వెళ్లి కలవడమే కాదు, మెగా ఫ్యామిలీ జరిగే పార్టీలకి తీసుకొస్తారు.
ఇక రేణు దేశాయ్ సినిమా షూటింగ్స్, పిల్లల పెంపకం అంటూ కష్టపడుతుంది. పిల్లల చదువులు, అలాగే వాళ్ళకి స్పెషల్ కలిక్యులర్ ఆక్టివిటీస్ అన్నీ రేణు దగ్గరుండి చూసుకుంటుంది. కానీ ఆమె అనారోగ్యం వలన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిల్లల బాధ్యలు తీసుకోవాలంటూ ఆయన ఫాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులిచ్చినా పిల్లల విషయంలో కేరింగ్ గానే ఉంటారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. సో ఇలాంటి సమయంలో అకీరా, ఆద్యల పూర్తి బాధ్యతలు పవన్ తీసుకోవాలని అంటున్నారు.
మరి ఇది కూడా జరిగితే పవన్ కి మరింత ఒత్తిడి. అంటే పిల్లల పెంపకం సమస్య అని కాదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న సిస్ట్యువేషన్ లో ఇది మరో కష్టమనే చెప్పాలి. చూద్దాం ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది.