Advertisementt

NBK108 స్టోరీ లీక్

Tue 14th Feb 2023 10:39 AM
nbk108,balakrishna  NBK108 స్టోరీ లీక్
NBK108 story revealed NBK108 స్టోరీ లీక్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న NBK 108 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. డిసెంబర్ లోనే యాక్షన్ సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ని చుట్టేసిన అనిల్ రావిపూడి-బాలయ్యలు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తదుపరి షెడ్యూల్ కి రెడీ అయ్యారు. మధ్యలో బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రమోషన్స్, అలాగే తారకరత్న ఆరోగ్యం విషయంలో మధనపడడం ఇవన్నీ ఇప్పుడు ఫినిష్ అవడంతో బాలయ్య షూటింగ్స్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే బాలకృష్ణ ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు NBK108 షూటింగ్ కి రెడీ అవుతున్నారు.

అయితే NBK108 స్టోరీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమా కథ ముప్పై ఏళ్ల వయసులో జైలు శిక్ష పడి.. నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కథతో రూపొందుతోందని తెలుస్తుంది. తండ్రి గురించి తెలియని కూతురు తండ్రిని విపరీతంగా ద్వేషించడం, తర్వాత తండ్రి ఫ్లాష్ బ్యాగ్ తెలుసుకుని తండ్రి కోసం తపనపడుతుంది అంటూ ఆ స్టోరీ పై ఈ న్యూస్ వైరల్ అయ్యింది. 

బాలకృష్ణ సింగిల్ కేరెక్టర్ లోనే మూడు రకాల వేరియేషన్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. ఫస్టాఫ్ మొత్తం బాలయ్య జైలులోనే కనిపిస్తారట. తండ్రికి-కూతురికి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయని తెలుస్తుంది. బాలయ్య జైలులో ఉన్నప్పుడు 50 ఏళ్ల వ్యక్తిగా, ఫ్లాష్ బ్యాక్‌ కథలో మాత్రం 35 ఏళ్లు పైబడిన యువకుడిగా కనిపించడమే కాదు, వీటితో పాటు మరో గెటప్‌లోనూ బాలయ్య ఇందులో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే బాలయ్య ఫాన్స్ కి ఆయన కేరెక్టర్ ట్రిపుల్ ధమాకా అందించబోతున్నదన్నమాట. 

ఈ చిత్రంలో బాలకృష్ణ కి కూతురుగా శ్రీలీల కనిపించబోతుంటే.. హీరోయిన్ విషయం ఇంకా తేలాల్సి ఉంది.

NBK108 story revealed :

Balakrishna- Anil Ravipudi combo Story leaked 

Tags:   NBK108, BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ