నిన్నమొన్నటివరకు ఎన్టీఆర్ ఫాన్స్ NTR30 విషయంలో మేకర్స్ ని సోషల్ మీడియాలో నానా తిట్లు తిడుతూ రచ్చ చేసారు. ఓ పది రోజుల పాటు NTR30 అప్ డేట్ కోసం వెయిట్ చెయ్యడమే కాదు.. #NTR30 హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తిట్టిపోశారు. ఫిబ్రవరి మొదలవుతుంది ఇంకా ఎన్టీఆర్30 అప్ డేట్ ఇవ్వడం లేదంటూ కోపం చూపించారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫాన్స్ కి స్మూత్ గానే వార్నింగ్ ఇచ్చినంత పని చేసాడు.
మీరిలా అప్ డేట్ కోసం రచ్చ చేస్తే నిర్మాతలు ఒత్తిడి ఫీలవుతారు. అప్ డేట్ ఉంటే నా భార్య కన్నా ముందు మీకే చెబుతాను, మీరు గోల చెయ్యొద్దు, నా ఫాన్స్ కే కాదు, ఇతర హీరోల పరిస్థితి ఇలానే ఉంది. అందరూ అర్ధం చేసుకోమంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫాన్స్ కి తారక మంత్రంలా పని చేస్తుంది. అందుకే అప్పటినుండి ఎన్టీఆర్ ఫాన్స్ కామ్ అయ్యారు. ఫిబ్రవరిలో NTR30 పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఎన్టీఆర్ చెప్పారు. సో ఆ మాటతో ఆ గడియ కోసం సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు తప్ప సోషల్ మీడియాలో రచ్చ మానేశారు.
మార్చి 20 కాదు అంతకు ముందు నుండే రెగ్యులర్ షూటింగ్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటకి ఎన్టీఆర్ ఫాన్స్ కట్టుబడి అల్లరి తగ్గించేశారు. ఇది చూసిన నెటిజెన్స్ ఎన్టీఆర్ మాట ఫాన్స్ కి తారక మంత్రమే అంటూ కామెంట్ చేస్తున్నారు.