సీజన్ 5 లో బిగ్ బాస్ రన్నరప్ గా గెలిచి షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయని కోల్పోయాడు. సిరి తో చేసిన అతి ఫ్రెండ్ షిప్ వలన షణ్ముఖ్ దీప్తి సునయనకి దూరమయ్యాడు. షణ్ముఖ్ చేష్టలు దీప్తిని హార్ట్ చెయ్యడంతో షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది ఆమె. ఆ తర్వాత షణ్ముఖ్ సోలోగా వెబ్ సీరీస్ లు చేసుకుంటుంటే.. దీప్తి సునయన తన పనిలో బిజీగా మారిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి కెరీర్ లో వారు బిజీ అయ్యారు. ఇక షణ్ముఖ్ మాత్రం లో ప్రొఫైల్ మాయింటింగ్ చేస్తున్నాడు. దీప్తి సునయన మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా బిజీగా ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది.
తాజాగా దీప్తి సునయన సోషల్ మీడియాలో అభిమానులతో మీటింగ్ పెట్టింది. అభిమానులు ఊరుకుంటారా.. బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటి అని ప్రశ్నించగా.. దానికి దీప్తి సునయన పనిలో క్షణం తీరిక లేకుండా రోజు రోజుకు రోబోలా అయిపోతున్నా అంటూ సమాధానమిచ్చింది. తర్వాత మరో అభిమాని ఒక మనిషిని మీ పర్సనల్ స్పేస్ లోకి తీసుకోవాలంటే అతడిలో ఏం చూస్తారు.. లైఫ్ లోకి ఆహ్వానించాలంటే ఎంత టైమ్ సమయం తీసుకుంటారు.. అని అడగ్గా.. నన్ను నవ్విస్తే చాలు అంటూ సింపుల్ గా క్యూట్ గా సమాధానం చెప్పింది.
అంటే దీప్తి సునయనాని ప్రేమిస్తూ, నవ్విస్తుంటే సరిపోతుంది అనేగా దానర్ధం. మరి సునయనాని నవ్వించే అబ్బాయిలెవరైనా ఉంటే ఆ పనేదో చూడండి అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం దీప్తి సునయన-షణ్ముఖ్ లు కలిసిపోయి హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు.