మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంలో మంచు అభిమానులు, నెటిజెన్స్ ఆఖరికి మీడియా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. జనవరిలో ఏదో గుడ్ న్యూస్ అంటూ ఊరించిన మంచు మనోజ్ తన పెళ్లి మేటర్ ఏమైనా చెబుతాడని ఆశపడ్డ వాళ్ళకి కొత్త సినిమా విషయం చెప్పి కూల్ చేసాడు కానీ.. అసలు విషయం దాచేసాడు. భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ ఏడడుగులు ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూస్తున్నవారికి నిరాశే ఎదురవుతుంది. ఈనెల 2న మనోజ్ రెండో పెళ్లి అంటూ ప్రచారం జరిగినా.. ఆ విషయంలో మంచు ఫ్యామిలీ కామ్ గానే వుంది.
ఈ ఆదివారం మంచు లక్ష్మి శ్రీకాళహస్తి శివుడి దర్శనానికి వెళ్లగా అక్కడ మీడియా వారు మంచు లక్ష్మి ని మంచు మనోజ్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న వేశారు. అదేదో మనోజ్ నే అడగండి అంటూ లక్ష్మీ తెలివిగా తప్పించుకుంది. సరే విష్ణు పై ట్రోల్స్ కి మీ సమాధానం ఏమిటి అంటే.. అది విష్ణు నే అడగండి అంది. అంతేకాకుండా దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు అవసరమా.. అయినా నేను నటించిన అగ్నినక్షత్రం విషయాలు అడగండి చెబుతాను అంటూ లక్ష్మి, మనోజ్ పెళ్లిపై ఎలాంటి క్లూ ఇవ్వకుండానే సమాధానం దాటవేసింది.