Advertisementt

యంగ్ టైగర్ కి బండ్ల గణేష్ థాంక్స్

Mon 13th Feb 2023 06:18 PM
ntr,temper  యంగ్ టైగర్ కి బండ్ల గణేష్ థాంక్స్
Bandla Ganesh thanks to Young tiger యంగ్ టైగర్ కి బండ్ల గణేష్ థాంక్స్
Advertisement
Ads by CJ

కమెడియన్ నుండి ప్రొడ్యూసర్ గా టర్న్ అయ్యి మధ్యలో రాజకీయాల్లో వేలు పెట్టి ప్రస్తుతం రాజకీయాలకి, సినిమాలకి, నటనకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటున్న బండ్ల గణేష్.. తాజాగా యంగ్ టైగర్ కి థాంక్స్ చెప్పడం ఎన్టీఆర్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రొడ్యూసర్ గా మారాక స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యాలని కలలు కన్నాడు. దేవరా అంటూ సోషల్ మీడియాని ఊపేసాడు. కానీ ఇప్పుడు దేవుడు పవన్ సీఎం అవ్వాలి, ఆయన్ని కెలాక్కూడదు, సినిమా చెయ్యనేమో అని మాట్లాడుతున్నాడు.

అయితే తాజాగా బండ్ల గణేష్ ఎన్టీఆర్ కి ఎందుకు థాంక్స్ చెప్పాడు అంటే.. తన నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ రిలీజ్ అయ్యింది ఈ రోజే. ఏ బ్రహ్మ ముహూర్తం టెంపర్ రిలీజ్ అయ్యిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని బ్లాక్ బస్టర్ లే యంగ్ టైగర్ కి థాంక్యూ ఫర్ ఆపర్చునిటీ సార్ @tarak9999 అంటూ తారక్ ని టాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా బండ్ల గణేష్ తెరకెక్కించిన టెంపర్ అటు పూరి కి ఇటు ఎన్టీఆర్ కి సక్సెస్ నివ్వడమే కాదు.. ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ కి బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది.

2015 లో ఇదే రోజు అంటే ఫిబ్రవరి 13న టెంపర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే అదే డేట్ ని మళ్ళీ బండ్ల గణేష్ టెంపర్ ని గుర్తు చేసుకున్నాడు. టెంపర్ రిలీజ్ అయిన రోజు సందర్భంగా బండ్లన్న ఈ ట్వీట్ వేశాడన్నమాట. బండ్ల గణేష్ ట్వీట్ ని ఎన్టీఆర్ ఫాన్స్ షేర్లు, లైక్స్ తో మోత మోగిస్తున్నారు.

Bandla Ganesh thanks to Young tiger:

NTR Temper release on 13th feb 2015

Tags:   NTR, TEMPER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ