సోషల్ మీడియాలో రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, అందులోను గ్లామర్ గా అందాలు ఆరబోస్తూ అదరగొట్టే ఫోజులతో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది, అందాలు ఆరబొయ్యడమే పనిగా పెట్టుకుంది, ఎంత చేసినా.. చూపించినా ఆమెకి ఒక్క అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు అవకాశాల కోసం వెంపర్లాడుతుంది. ఆమె ఎవరో కాదు గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే రకుల్ ఇప్పుడు చిక్కిపోయింది. అయినా అందాలు చూపించడంలో ఏమాత్రం తగ్గదు. తగ్గింది బరువే... అందాలు కాదు అని చెప్పకనే చెబుతుంది.
తాజాగా బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో కలిసి ముంబై లో జరిగిన కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరైంది. చాలా గ్లామర్ గా డిజైనర్ డ్రెస్ లో రకుల్ నిజంగా అందంగా, గ్లామర్ గా కనిపించింది. అదే డ్రెస్ తో ఫోటో షూట్ చేయించుకుని సోషల్ మీడియాలో వదిలింది. ఆ పిక్స్ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. అయ్యో ఈ అందాలను చూడండి, పట్టించుకోండర్రా కనీసం గుర్తించండర్రా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో రకుల్ సినిమాలు చెయ్యడం లేదు. ఆమెకి తెలుగు అవకాశాలు పూర్తిగా తగ్గాయి.
తమిళనాట కమల్ హాసన్ ఇండియన్ 2 అలాగే బాలీవుడ్ లో ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తుంది. ఆమె టాలీవుడ్ అవకాశాలు కోసం ఎదురు చూసినా అది జరగడం లేదు. ఇలా గ్లామర్ షూట్స్ వదిలితే ఎమన్నా పని జరుగుతుందేమో అని ఆమె ఆశ. కానీ రకుల్ ని పట్టించుకునే వాడే లేడు.