Advertisementt

అందరిని పొగడలేక మానేసాను: జగపతి బాబు

Mon 13th Feb 2023 02:35 PM
jagapathi babu,interview  అందరిని పొగడలేక మానేసాను: జగపతి బాబు
I stopped praising everyone: Jagapathi Babu అందరిని పొగడలేక మానేసాను: జగపతి బాబు
Advertisement
Ads by CJ

సీనియర్ హీరో ప్రస్తుతం విలన్ పాత్రధారి జగపతి బాబు రీసెంట్ గా తన 61 వ పుట్టినరోజుని ని జరుపుకున్నారు. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చాలా విషయాలు మట్లాడారు. బర్త్ డే అంటే మందు కొట్టి పార్టీ చేసుకోవడమే అని గత ఏడాది పుట్టిన రోజువరకు అనుకునేవాడిని, ఇక 60 వ బర్త్ డే ని నా ఫ్యామిలీ, పిల్లలు కలిసి చాలా బాగా చేసారు. బర్త్ డే అంటే ఇదే కదా అని మురిసిపోయాను. ఆ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఓ పదేళ్ల వరకు గుర్తుపెట్టుకుంటాను. అప్పటికి 70 ఏళ్ళు వస్తాయి. అప్పుడు మళ్ళీ చిన్నపిల్లాడిలా బర్త్ డే ఎలా చేసుకుంటే బావుంటుంది అని ఆలోచిస్తాను అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇంకా నా కెరియర్ మొదలై అప్పుడే 35 ఏళ్లు అవుతున్నాయంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నా కెరీర్ లో ఎంతోకొంత సాధించాననే అనుకుంటున్నాను. సినిమా తప్ప నాకు మరో ప్రపంచం  తెలియదు. ఏ బిజినెస్ లు తెలియదు, నలుగురిలో కలవడం అంతకన్నా తెలియదు, మాట్లాడటం రాదు, ముఖ్యంగా మాయమాటలు చెప్పడం తెలియదు, నేను కమర్షియల్ ఆలోచనలు చెయ్యను. అంతేకాకుండా కొన్ని రోజులుగా నేను సినిమా ఈవెంట్స్ కి వెళ్లడం మానేసాను. 

ఎందుకంటే అక్కడికి వెళ్లి అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయాను. స్టార్ హీరోల మధ్యలో స్టేజ్ పై అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి నుంచునే అవసరం నాకు లేదు.. నాకు రాదు అంటూ జగపతి బాబు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.

I stopped praising everyone: Jagapathi Babu:

Jagapathi Babu Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ