తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే.. ఆయన బాబాయ్ బాలకృష్ణ అన్న కొడుకు కోసం నిద్రాహారాలు మానేసి, తన పనులు పక్కనబెట్టి ఆసుపత్రిలోనే ఉండిపోయారు. దాదాపు పదిరోజుల పాటు బాలకృష్ణ తారకరత్న చుట్టూనే తిరిగారు. ఇక తారకరత్న క్రమేణా విదేశీ వైద్యుల చికిత్సలో కోలుకుంటుంటే.. బాలకృష్ణ ఇక తన పనిలో పడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ NBK108 చేస్తున్నారు. మరోపక్క ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో సెకండ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సీజన్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ తో బాలయ్య చేసిన ఎపిసోడ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.
అయితే బాలకృష్ణ ఫ్రెష్ గా సెట్స్ మీదకి వచ్చేసారు. అది కూడా అఖండలో తనతో రొమాన్స్ చేసిన ప్రగ్య జైస్వాల్ తో సహా బాలయ్య షూటింగ్ లోకి దిగిపోయారు. అంటే అనిల్ రావిపూడి మూవీలో బాలయ్య ప్రగ్య జైస్వాల్ తో రొమాన్స్ చేస్తున్నారు అనుకునేరు.. కాదు బాలకృష ప్రగ్య తో కలిసి ఓ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి బ్రాండ్ ని ప్రమోట్ చెయ్యని బాలయ్య మొదటిసారి సాయి ప్రియా కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం ఓ యాడ్ చేసారు.
ఇప్పుడు బాలకృష్ణ మరో యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ యాడ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య మరియు ప్రగ్యా ఇద్దరూ వివాహ సన్నివేశంలో కనిపించిన యాడ్ షూట్ లొకేషన్స్ నుండి ఒక స్నాప్ బయటకు వచ్చింది. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే బాలయ్య ఏ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారో తెలియాల్సి ఉంది.