ఒకప్పుడు సౌత్ సినిమాల్లో ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ని మెయింటింగ్ చేసి తర్వాత బాలీవుడ్ కి జంప్ చేసాక.. అడపా దడపా మాత్రమే సౌత్ లోకి వచ్చి వెళ్ళిన ఇలియానా కి సౌత్ అవకాశాలు రాకో.. లేదంటే ఇలియానా సౌత్ ని లైట్ తీసుకుందో అందుకే ఇక్కడ కనిపించడం లేదు అనుకున్నారు. కానీ తాజాగా ఇలియానా బాలీవుడ్ తర్వాత దక్షిణాదిలో పెద్దగా కనిపించకపోవడానికి ఓ స్ట్రాంగ్ రీసన్ ఉందట, అది ఇలియానా దేవుడి చేసిన మనుషులు చేసిన తర్వాత ఆమెని సౌత్ మూవీ ఇండస్ట్రీ బాన్ చేసింది అనే న్యూస్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఇలియాన చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే ఆమె.. ఓ కోలీవుడ్ సినిమాకు సైన్ చేసిందట. విక్రమ్ హీరోగా కోలీవుడ్ నిర్మాత నటరాజ్ నందం అనే సినిమాను ప్లాన్ చేసాడట. ఈ మూవీలో ఇలియానాకు భారీ పారితోషకం ఇస్తామని చెప్పి ఓ 40 లక్షల అడ్వాన్స్ తో హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దాంతో నిర్మాత నటరాజ్.. ఇలియానాని తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడట. దానికి ఇలియానా అంగీకరించలేదట.
అడ్వాన్స్ అయితే ఇచ్చేది లేదు.. కావాలంటే.. మరో సినిమాలో నటిస్తాను తప్ప.. అని తేల్చి చెప్పిందట. దానితో చిర్రెత్తుకొచ్చిన నటరాజ్.. నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఇలియానాపై ఫిర్యాదు చెయ్యడంతో వారు కూడా ఇలియానాని అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని చెప్పినా.. ఇలియానా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. ఆమెపై నిషేదం విధించారట.
డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇలియానాని సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించడం వలనే ఇలియానా సౌత్ మూవీలో అప్పటినుండి కనిపించకుండా పోయింది అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.