నందమూరి తారక రత్న సివియర్ హార్ట్ ఎటాక్ తో లోకేష్ యువగళం పాదయాత్రలో కుప్పకూలిపోయి కుప్పం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మెరుగైన వైద్యం కోసం ఆయనని కుటుంబ సభ్యులు బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్న శరీరం వైద్యానికి స్పందిస్తుంది అంటున్నారు కానీ.. అసలు ఆయన హెల్త్ స్టేటక్ కరెక్ట్ గా ఎవ్వరూ చెప్పడం లేదు. దానితో అభిమానుల్లో గందరగోళం మొదలైంది.
మధ్యలో తారకరత్నని మెరుగైన వైద్యం కోసం విదేశాలకి తరలిస్తున్నారు అని టీడీపీ నేత ఒకరు చెప్పారు. కానీ ఆ స్టేటస్ కూడా లేదు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రమోషన్స్ లో తారకరత్న కోలుకుంటున్నాడు అంటూ చెప్పారు.. అసలు విషయం చెప్పలేదు. అయితే తాజాగా రోడ్ యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తారకరత్న హెల్త్ విషయమై మట్లాడారు. రామకృష్ణ మాట్లాడుతూ బెంగుళూరు నారాయణ హృదయాలయకి విదేశీ వైద్యులను రప్పించి తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
గుండె సమస్యతో పాటుగా నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స చేస్తున్నట్టు వివరించారు. దానితో తారకరత్నని విదేశాలకి తరలించడం కాదు, తారకరత్న కి విదేశీ వైద్యులే వచ్చి వైద్యం అందిస్తున్నారని ఆయన చెప్పారు.