ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు ముచ్చట్లే. ఎంత రేటైనా ఆర్పీ చేపల పులుసు కొనాల్సిందే, రుచి చూడాల్సిందే అన్న రేంజ్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హైదరాబాద్ లో ఫెమస్ అయ్యింది. కేవలం ఆర్పీ చేపల పులుసు ఇంతగా ఫెమస్ అవ్వడానికి యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కారణం. ఆ యూట్యూబ్ ఛానల్స్ లో ఆర్పీ చేపల పులుసు తయారీ, షాప్ దగ్గర క్రౌడ్, చేపల పులుసు కోసం జనాలు ఎగబడడం అన్నిటిని పార్టు పార్టులుగా యూట్యూబ్ ఛానల్స్ లో రావడంతో హైదరాబాద్ వాసుల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ చూడాలన్న కోరిక పెరిగిపోయింది.
అనుకున్నట్టుగానే ఆర్పీ పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ని మణికొండ లో గ్రాండ్ గా ఓపెన్ చేసాడు. ఇపుడు అమీర్ పేట్ వాసుకిలకి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని టేస్ట్ చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. అమీర్ పేట వాస్తవ్యులకి, ఎస్ ఆర్ నగర వాస్తవ్యులకి అతి త్వరలోనే ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అందబోతుంది. కూకట్ పల్లిలో పెట్టిన రెండు నెలలకే మణికొండలో చేపల పులుసు పాయింట్ ఓపెన్ చేసిన ఆర్పీ మరో రెండు నెలలో అమీర్ పేటలో కూడా పెట్టేస్తాడేమో చూడాలి.
ఇంకా హైదరాబాద్ లోని పలు ప్రధాన ఏరియా ల్లో ఈ చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేస్తానంటూ ఆర్పీ చెప్పాడు. అలాగే ఇక్కడ బాగా సక్సెస్ అయ్యాక అనుభవం వచ్చాక అమెరికాకి కూడా ఆర్పీ చేపల పులుసు వెళుతుంది అని చెప్పాడు.