బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ చాలా మధనపడుతున్నారు. ప్రభాస్ మునుపుటి(డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి) మాదిరి కనిపించాలని ప్రభాస్ ఫాన్స్ కోరిక. కానీ ప్రభాస్ పెరిగిన వెయిట్, పోయిన గ్లో ని తెచ్చుకోవడానికి చాలా తంటాలు పడుతున్నారు. ఎంతగా జిమ్ చేసినా బరువు తగ్గడం లేదు, అలాగని ఫేస్ లో గ్లో పెరగడం లేదు. హెయిర్ స్టయిల్ విషయంలోనూ ఏదో విగ్ మెయింటింగ్ చేస్తున్నట్టుగా.. తలకి ఓ బ్లాక్ క్లాత్ కట్టుకోవడం ఫాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఎలా ఉండాలి.. కానీ ప్రభాస్ అలా లేరే అనే ఆందోళనలో ఫాన్స్ ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ K, సలార్, మారుతీ షూటింగ్స్ తో బాగా బిజీగా మారిన ప్రభాస్ ఈమధ్యన ఫీవర్ బారిన పడి కోలుకున్నారు. అలాగే ప్రభాస్ ఎంగేజ్మెంట్ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా, ఆయన పీఆర్ టీమ్ ఆ రూమర్స్ ని కొట్టిపారేశాయి. ఇక తాజాగా ప్రభాస్ న్యూ లుక్ ఒకటి బయటికి వచ్చింది. ప్రభాస్ కొత్త లుక్ చూసి అభిమానులు ఇంప్రెస్స్ అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులని కలిశారు ప్రభాస్. వాళ్లతో సమయం గడిపారు.
తాజా లుక్ లో ప్రభాస్ కళ్ళకు అద్దాలు, లైట్ కలర్ షర్ట్ లో కొద్దిపాటి గెడ్డం తో సూపర్ స్టైలిష్ హెయిర్ తో చాలా అంటే చాలా హ్యాండ్ సమ్ గా కనిపించడంతో ప్రభాస్ ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ లుక్ విషయంలో వారు శాటిస్ఫాయ్ అవుతున్నారు.