నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో మాస్ మూవీగా తెరకెక్కి ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి థియేటర్స్ లో మాస్ ఫాన్స్ చేత విజిల్స్ వేయించింది. వీరసింహారెడ్డిగా బాలకృష్ణ లుక్స్, ఆయన డైలాగ్ డెలివరీకి ఫాన్స్ ఫిదా అయ్యారు. అలాగే శృతి హాసన్ తో సాంగ్స్ లో బాలయ్య స్టెప్స్ విపరీతంగా ఆట్టుకున్నాయి. ఫ్యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన వీరసింహారెడ్డి థియేటర్ రన్ ఆల్మోస్ట్ పూర్తివడంతో మేకర్స్ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యారు.
అఖండతో అద్భుతమైన ఓటిటి విజయాన్ని సొంతం చేసుకున్న డిస్నీ+ హాట్ స్టార్ వారు భారీ ధరకు వీరసింహారెడ్డి ఓటిటి హక్కులని కూడా కొనుగోలు చేశారు. అయితే వీరసింహారెడ్డి విడుదలైన 40 రోజులకి ఓటిటిలో రిలీజ్ చేసేందుకు డిస్నీ+ హాట్ స్టార్ వారు డేట్ లాక్ చేసారు. ఓటిటిలో వీరసింహారెడ్డిని చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి డిస్నీ+ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల అంటే ఫిబ్రవరి 23 నుంచి వీరసింహారెడ్డి ఓటిటి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.