Advertisementt

ఇ-రేస్: స్టాస్ కిడ్స్ సందడి

Sun 12th Feb 2023 12:21 PM
akira,gautam,formula e race  ఇ-రేస్: స్టాస్ కిడ్స్ సందడి
Stars descend upon Hyderabad for Formula E race ఇ-రేస్: స్టాస్ కిడ్స్ సందడి
Advertisement
Ads by CJ

హైదరాబాద్ నడిబొడ్డున ఫార్ములా ఇ-రేస్ ఘనంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇ రేస్ నిర్వహించారు. శుక్రవారం ప్రాక్టీస్ రేస్ జరగగా.. నిన్న రేస్ జరిగింది. అయితే శుక్రవారం ఎన్టీఆర్ భార్య ప్రణతి, బ్రాహ్మణి తమ పిల్లలతో ప్రాక్టీస్ రేస్ చూడడానికి రాగా.. నమ్రత, పివి సింధులు కూడా వచ్చారు. ఇక నిన్న జరిగిన రేస్ లో స్టార్ కిడ్స్ సందడి చేసారు. రామ్ చరణ్, నాగార్జున, అఖిల్, నాగ చైతన్య, KTR, సచిన్, యష్, దుల్కర్ లాంటి సెలబ్రిటీస్ రాగా.. అందరిలో ముఖ్యంగా స్టార్ కిడ్స్ అందరిని ప్రత్యేకంగా ఆకర్షించారు.

అందులో మహేష్ బాబు కొడుకు గౌతమ్, అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం అకీరా, గౌతమ్ లు హీరోలుగా ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారా అనే ఆతృతలో అభిమానులు ఉన్న సమయంలో వారు ఇలా ఓ రేస్ కి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు కూడా ఇ-రేస్ ప్రాక్టీస్ రోజున మీడియాలో కనిపించారు. 

Stars descend upon Hyderabad for Formula E race:

Akira, Gautam enjoy Formula E Race