టాలీవుడ్ డైరెక్టర్స్ ఇప్పుడు తమిళ హీరోల వెంట పడుతున్నారు. తెలుగు హీరోలు వేరే కమిట్మెంట్స్ తో డేట్స్ దొరక్క కోలీవుడ్ హీరోల చుట్టూ తెలుగు దర్శకులు తిరుగుతున్నారు. అక్కడి డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు మొదలు పెట్టారు. సౌత్ సినిమాల విషయంలో అక్కడి డైరెక్టర్స్ ఇక్కడ, ఇక్కడి హీరోలు , డైరెక్టర్స్ అక్కడ అన్నట్టుగా ఉంది వ్యవహారం. అయితే తెలుగులో జాతి రత్నాలతో హిట్ కొట్టిన అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ మూవీ చేసి భారీ డిసాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా గత ఏడాది దసరా టైమ్ లో విడుదలై కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేదు.
ఇక వంశీ పైడిపల్లి మహేష్ తో మూవీ ఆగిపోవడంతో అదే కథతో తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు చేసాడు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో సో సో గా ఆడగా.. తమిళంలో హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు. వెంకీ అట్లూరి నితిన్ రంగ్ దే తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ తో సార్ మూవీ చేసాడు. ఆ సినిమా ఈ శివరాత్రి స్పెషల్ గా విడుదలకి రెడీ అయ్యింది. మరి వెంకీ అట్లూరి సార్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.. అంటూ టాలీవుడ్ ఎదురు చూస్తుంది.
ఇప్పటికైతే తెలుగులోనూ సార్ మీద పాజిటివ్ బజ్ కనిపిస్తుంది. అలాగే సార్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ జరగగా.. రేపటినుండి హీరోయిన్, అలాగే డైరెక్టర్స్ ఇంటర్వూస్ ప్లాన్ చేసింది టీమ్. మరి వెంకీ అట్లూరి అయినా సార్ రిజల్ట్ తో సత్తా చాటుతాడేమో చూడాలి.
తర్వాత వరసలో శేఖర్ కమ్ముల కూడా కోలీవుడ్ స్టార్ ధనుష్ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది.