Advertisementt

సినిమాలు మానేసి బిజినెస్ చేసుకుంటుందట

Sun 12th Feb 2023 10:48 AM
actress hema  సినిమాలు మానేసి బిజినెస్ చేసుకుంటుందట
Quit movies and do business: Actress Hema సినిమాలు మానేసి బిజినెస్ చేసుకుంటుందట
Advertisement
Ads by CJ

నటి హేమ అందరికి సుపరిచయమే. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్స్ కి భార్య కేరెక్టర్స్ లో స్టార్ హీరోల సినిమాల్లో కనిపించే హేమ ఈమధ్యన వెండితెర మీద అస్సలు కనిపించడం లేదు. కారణం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆమెకి అవకాశాలు రావడం లేదా.. వచ్చినా రిజెక్ట్ చేస్తుందా అనేది చాలామందికి తెలియడం లేదు. ఎప్పుడూ మోడరన్ గా, గ్లామర్ గా కనిపించే హేమ తెలుగు బిగ్ బాస్ లోకీ వెళ్ళొచ్చింది. అలాగే మా ఎలక్షన్స్ లో హేమ హడావిడి చేసింది. ఆ తర్వాత హేమ మీడియాలో అరుదుగా కనిపిస్తుంది.

తాజాగా ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ లో మెరిసింది. ఆర్పీ ఆహ్వానం మేరకు ఓపెనింగ్ కి వచ్చిన హేమని మీడియా చుట్టుముట్టింది. హేమ గారు మీరు సినిమాల్లో కనిపించడం మానేసారేమిటి అని అడిగితే.. దానికి హేమ కాస్త వ్యగ్యంగానే.. నేను ఈ మధ్యన కొత్త బిజినెస్ పెట్టాను.. ఆ బిజినెస్ సక్సెస్ అయ్యి మంచి లాభాలు వస్తున్నాయి. డబ్బులు చూసాక కష్టపడబుద్ది కావడం లేదు. సుఖ పడడం అలవాటైపోయింది అందుకే సినిమాలు మానేశానంటూ హేమ చెప్పుకొచ్చింది.

అయితే హేమ ఏ బిజినెస్ పెట్టింది, ఆ బిజినెస్ లో నిజంగానే అంత సక్సెస అయ్యిందా, లేదంటే గ్లామర్ ఫీల్డ్ ఎందుకొదిలేస్తుంది. హేమ సినిమాలు మానెయ్యడానికి నిజంగా బిజినెస్ కారణమా.. లేదంటే మరేదన్నానా అనే అనుమానాలు నెటిజెన్స్ లో మొదలయ్యాయి.

Quit movies and do business: Actress Hema:

Actress Hema Reveals Reasons Behind Not Acting in Movies 

Tags:   ACTRESS HEMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ